Home / Food Recipes
సాధారణంగా పచ్చి శనగపప్పును కూరల్లో ఉపయోగిస్తారు. అయితే శనగపప్పును కూరగా తయారు చేసుకోవచ్చు. దీనిని పాఠోళీ అంటారు. ఇటీవల కాలంలో దీనిని తయారు చేయడం తగ్గింది. కాని సెలవుదినాల్లో వెరైటీ టేస్ట్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
బంగాళాదుంపలతో కూరలనే కాకుండా చిరు తిళ్లను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు అనగానే అందరికి ముందుగా చిప్స్ గుర్తుకు వస్తాయి. చిప్స్ మాత్రమే కాకుండా బంగాళాదుంపలతో ఇతర చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు.
దక్షిణభారతీయులు ఆహారంలో సాధారణంగా ఉండేవి రెండే. అవి సాంబార్, రసం. మన పూర్వీకుల కాలంలో ఉలవచారు చాలా ఫేమస్. కానీ ఇప్పుడు ఎవరికీ అది గుర్తుకు లేదు. ఉలవచారుశరీరానికి చాలా పోషకాలతో పాటూ, శక్తి లభిస్తుంది. నీరసం దరిచేరదు.
పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.
కాలం మారుతున్న కొద్దీ కొత్తరుచులు వచ్చి పాత రుచులు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో పనసాకు పొట్టిక్కలు ఒకటి. పనస బుట్టలు ఉత్తరాంధ్ర వారి ప్రత్యేక వంటకం. వినాయక చవితికి తప్పక వండుతారు. లేత పనసాకులను బుట్టలా కుట్టి అందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
శ్రావణమాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు, పండుగలు మొదలవుతాయి. ఈ సందర్బంగా పలు రకాల పిండివంటలను, నైవేద్యాలను తయారు చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే స్వీట్స్ విషయానికొస్తే ఎప్పుడు తినేవి కాకుండా కొత్త రకాలను ట్రై చేయాలని పలువురు భావిస్తారు.
మనం వంటింట్లో పచ్చి కొబ్బరిని ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పచ్చడిని, కొబ్బరి చట్నీని, కొబ్బరి అన్నాన్ని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసుకోగలిగే తీపి పదార్థాలలో కొబ్బరి ఉండలు కూడా ఒకటి. ఈ కొబ్బరి ఉండలు ఎంతో రుచిగా ఉంటాయి.
మరమరాలు అందరికీ తెలిసినవే. వీటితో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మరమరాలను మనం ఎక్కువగా స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. వీటిని బియ్యం నుండి తయారు చేస్తారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని ఎక్కువగా తినరు. కానీ బియ్యంతో తయారు చేసిన మరమరాలను తినవచ్చు.
సాధారణంగా మనం పాలతో రకరకాల తీపి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాం. పాలతో చేసే తీపి పదార్థాలలో పాలకోవా ఒకటి. పాలకోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. చాలా తక్కువ సమయంలో పాలకోవాను మనం పాలపొడితో తయారు చేసుకోవచ్చు. పాల పొడితో చేసిన ఈ పాలకోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాలపొడితో ఎంతో రుచిగా ఉండే పాలకోవాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు పట్టణాల్లో బొంబాయి చట్నీ కనిపించడం లేదు కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇది చేయడం చాలా సులువు అందుకే అక్కడ దీనిని రోజూ తయారు చేస్తారు. శనగపిండితో చేసే పచ్చడి కావడంతో దీనినిశెనగపిండి చట్నీ అని కూడా పిలుస్తారు.