Home / Congress Party
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది.
రాహుల్ గాంధీ తన గడ్డం గీసుకుంటే భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలా కనిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో బుధవారం ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అందులో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ బుధవారం పార్టీ రాజస్థాన్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది