Home / bollywood news
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు.
సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో తన పేరును అన్యాయంగా చేర్చారంటూ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై రూ. 200 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్యన్ ఖానే వెల్లడించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో ఆర్యన్ హీరోగా తెరమీద కనిపించకుండా తెరవెనుక ఉండనున్నాడు.
'మీర్జాపూర్' వెబ్ సిరీస్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ లవర్స్ కి అలీ ఫజల్ గుడ్ న్యూస్ చెప్పాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు.
ప్రస్తుతం షారూఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే చిత్రం నుండి విడుదలయిన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా టీజర్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా పఠాన్ రికార్డు క్రియేట్ చేసింది.
డిసెంబర్ ఈ ఏడాది చివరి నెల. ఈ నెలలో సాధారణంగా పెద్దగా విడుదలయ్యేవి ఉండవు, ఎందుకంటే అన్ని పెద్ద చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయబడతాయి.
చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు 'దృశ్యం 2' ఊపిరిపోసింది.
అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ ఫోటో, పేరు, వాయిస్ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బాలీవుడ్ నాట గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఇకపోతే రీసెంట్ గా మలైకా చేసిన పోస్ట్ చూస్తే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.