Isha Ambani: మెట్ గాలా లో ఇషా అంబానీ బ్యాగ్ హిస్టరీ తెలుసా?
నేపాలీస్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన ఈ శాటిన్ బ్లాక్ క్రేప్ శారీ గౌన్‌లో ముస్తాబైంది ఈషా.
Isha Ambani: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముద్దుల గారాల పట్టి ఈషా అంబానీ. బ్యూటీ విత్ బ్రెయిన్ గా పేరుతెచ్చుకుంది. ప్రతి ప్రొగ్రోమ్ లో తన దైన స్టయిల్ లో మెరిసిపోతుంది. ఇటీవల న్యూయార్క్ గా జరిగిన ‘మెట్ గాలా 2023’లో కూడా అదరగొట్టింది. అసలే అందాల యువరాణి. ఆ పైన బ్లాక్ శారీ గౌన్. ముందు వైపు కఫ్తాన్ స్టయిల్ లో డిజైన్.
అందరి చూపు బ్యాగ్ పైనే(Isha Ambani)
నేపాలీస్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన ఈ శాటిన్ బ్లాక్ క్రేప్ శారీ గౌన్‌లో ముస్తాబైంది ఈషా. అందుకు తగ్గట్టు స్టేట్‌మెంట్ డైమండ్ జ్యువెలరీ, లేయర్డ్ నెక్లెస్‌తో మరింత గ్లామరస్‌గా కనిపించింది. అయితే ఆమె చేతిలోని డాల్ బ్యాగ్ భలే ఆకట్టుకుంది. ఛానెల్ కంపెనీ విడుదల చేసిన ప్యారిస్ బాంబే కలెక్షన్ నుంచి ఈ బ్యాక్ ను సెలెక్ట్ చేసుకుంది ఈషా.
ఆ బొమ్మకు బొట్టు, ముత్యాలతో పాపిడ బిళ్ల లాంటి వాటితో భారతీయ పెళ్లికూతరు లా డిజైన్ చేశారు. అయితే ఒక్క డిజెన్ మాత్రమే కాదు.. దాని ధర కూడా అంతే ఆకట్టుకుంటోంది. దాని ధర రూ. 24 లక్షలు. ఇలా తన స్టేట్ మెంట్ ఫ్యాషన్ సెన్స్ తో మరో సారి మెట్ గాలా వేడుకలో మెరిసిందీ ఈషా.