Home / BJP
నగరాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2వేల కోట్లు ఇచ్చిందని, అయితే తీరం వెంబడి 5లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు కాదు గదా, కనీసం బెర్త్ లు కూడ కట్టే పరిస్ధితి లేదని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేస్తున్న వీడియో ఎంపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది.
కేంద్ర ప్రభుత్వ తీరు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. డాలర్తో రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు
చనిపోయిన వారితో జగన్ రాజకీయాలు..ఏపీ సర్కార్ కు బీజేపీ బిగ్ షాక్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
సీఎం కేసిఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కావాలనే మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేదిత ఫిఎఫ్ఐ సంస్థను కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారన్నారు.
భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ పన్నుల రాబడిని పెంచడం పై దృష్టి సారించడం లేదని, గణాంకాల ప్రకారం ఛార్మినార్ జోన్ లో 50శాతం మాత్రమే పన్నులు వసూల కావడం పై భాజపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు.
సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరమైన గ్యాస్ సిలెండర్ ను రూ. 500లకే అందించే దస్త్రం పైనే కాంగ్రెస్ తొలి సంతకమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు.
నిందితులకు తగిన గుణపాఠం పేరుతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్య నాధ్ తీసుకొచ్చిన బుల్ డోజర్ వ్యవస్ధను భాజాపా మద్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరిచింది. ఈమేరకు ఓ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందుతుల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చివేసి ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.