Last Updated:

Gaurav Bhatia: స్వచ్ఛమైన గాలిని అందించలేకపోయారు.. ఢిల్లీ సీఎం రాజీనామా చేయాలన్న భాజపా నేత గౌరవ్ భాటియా

పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

Gaurav Bhatia: స్వచ్ఛమైన గాలిని అందించలేకపోయారు.. ఢిల్లీ సీఎం రాజీనామా చేయాలన్న భాజపా నేత గౌరవ్ భాటియా

New Delhi: పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ ను మందిలించిన భాటియా మాట్లాడుతూ పంజాబ్ లో పొట్టేలు కాల్చడం ద్వార వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం 1లక్షా 20వేల మిషన్లు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. గతంలో ఆప్ అధినేత కాలుష్యం గురించి మాట్లాడేవారని, ప్రస్తుతం పంజాబ్ లో కాలుష్య సమస్యపై కేజ్రీవాల్ ఏం సమాధానం చెబుతారని భాటియా ప్రశ్నించారు. మరో వైపు వ్యవసాయ సమస్యలు కూడా తొలగిపోలేదని గుర్తుచేశారు.

పంజాబ్‌లో గడ్డి తగులబెట్టిన కేసుల్లో 30 శాతం పెరుగుదల పై ఆప్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నారన్నారు. పంజాబ్‌కు గరిష్టంగా రూ. 1,300 కోట్లు, హర్యానాకు రూ. 693 కోట్లు మొండిచెట్టు తొలగింపు కోసం ఇచ్చినట్లు నివేదికలు రుజువు చేస్తున్నాయి అని భాటియా వ్యాఖ్యానించారు. ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో పరిపాలన సాగుతుండడంతోపాటు గుజరాత్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో కాలుమోపేందుకు ఆప్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ పై భాజపా ఎదురుదాడికి ప్లాస్ చేసింది.

ఇది కూడా చదవండి: Morbi bridge incident: మోర్బీ ఘటనలో ప్రజల ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే.. నెట్టింట వైరల్