Home / ap rains
గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.
వామ్మో మళ్ళీ వర్షాలు షురూ
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.