Last Updated:

Weather Update: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..!

గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.

Weather Update: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..!

Weather Update: గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది. ఈ నెల 23న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ నెల 24న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో… ఈ నెల 25న ఉత్తర కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని.. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయిని సూచించింది.

ఇదీ చదవండి: Death Certificate advertisement: “నా డెత్ సర్టిఫికేట్ పోయింది”.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన..!

ఇవి కూడా చదవండి: