Home / Ap Government
రాష్ట్రవిభజన,అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. అమరావతి పై 8, రాష్ట్ర విభజన పై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు గుడ్ న్యూస్. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లను నేను లేని మరో ధర్మాసనంకు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ రిజిస్ట్రీని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ . గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్‌కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతుల తలపెట్టిన పాదయాత్ర పై ఇటు ప్రభుత్వం, అటు రైతుల పిటిషన్ల పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని న్యాయవాదులు కోరారు.
ఏపీలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల సెగ తగిలింది. స్టైఫండ్ 42 శాతానికి పెంచాలంటూ డాక్టర్లు కోరికను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసు కూడా అందించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రూ. 250కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం కింద చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు అనే విషయం కామన్ అయిపోయాయి.