Home / Andhrapradesh News
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్‌కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు.
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారిన ఏపీని కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు అందిస్తామన్నారు.
అనకాపల్లి జిల్లా బవులువాడ గ్రామ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఆవు దూడపై దాడి చేసిన పుని సమీప అడవిలోకి వెళ్లింది.
ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఫుల్ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి.
జగన్ సర్కారు పై జనసేన విమర్శల దాడిని పెంచుతోంది. నవరత్నాలపై నవసందేహాలంటూ ప్లీనరీ రోజునే వైసీపీని పవన్ టార్గెట్ చేశారు
వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవఅధ్యక్షురాలిపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు.