Home / Andhrapradesh News
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.
ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.
అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తూ అమరావతి రైతులు చేపట్టిన రెండవ విడుత మహా పాదయాత్ర అనుమతి లేదన్న డిజిపి ఆర్డర్స్ ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. పరిమితి ఆంక్షలతో పాదయాత్ర చేపట్టవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన కేసులో ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరంటూ కేసును ధర్మాసనం కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వరుసగా నాలుగో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తోంది.
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.