Home / Andhra Pradesh latest news
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జయహో బీసీ సభ ప్రారంభమైంది. ఈ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు హాజరుకాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మహాసభ జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు.
స్కిల్ డెవల్‌పమెంట్ సహా ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు సవాల్ చేశారు.
దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.
సీఎం జగన్ కడప జిల్లాలో పార్నపల్లి రిజర్వాయర్ బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. బోట్టింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం... స్వయంగా అందులో కొద్దిసేపు ప్రయాణం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆసుపత్రుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని మంగళగిరి ఎన్నారై హాస్పిటల్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలోచంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టిడిపి నాయకులు. టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసిపి నేతలు.
తమపై ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు