Home / Andhra Pradesh latest news
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
ఉద్యానవన పంటలతో రైతులు లాభాలు పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో చామంతి సాగుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన మద్దుతుదారుల ఇళ్లు తొలగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద తిరుపతిలో రుయా ఆసుపత్రి కేంద్రంగా పెద్ద స్కాం జరిగింది. ఈ విషయం ప్రైమ్9 న్యూస్ దెబ్బకి ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరిన్ని పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
అనంతపురం జిల్లాకు చెందిన మల్లిఖార్జునరెడ్డి అనే రైతు వినూత్న వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతున్నారు. బత్తాయి సాగును చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా చూసేయ్యండి.
సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి..
ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.