Home / Allu Arjun
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా వార్తల్లోనిలుస్తోంది. ఇటీవలే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .
తన మొట్టమొదటి మ్యూజిక్ కమ్ డ్యాన్స్ వీడియోలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దక్షిణ కొరియా అమ్మాయి బృందం TRI.BE తో కలిసి ఉన్నాడు. ఈ వీడియోను ఆవిష్కరించిన అల్లు అర్జున్, ఈ వీడియోలో భాగమైన ప్రతి క్షణం తనకు చాలా ఇష్టమని,
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ గురించి అందరికీ తెలిసిందే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత బన్నీ అదితి అగర్వాల్‌ను కలిశాడు. అమెరికాలో గంగోత్రి జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూలు చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప - ది రైజ్' మరో రికార్డును నెలకొల్పింది భారతదేశంలో 5 బిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఆల్బమ్‌గా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. సోషల్ మీడియాలో చిత్ర నిర్మాతలు పోస్టర్‌ను పంచుకున్నారు