KKR Target against PKBS: తేలిపోయిన పంజాబ్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..?

Punjab Kings All Out Against Kolkata Knight Riders: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. ఛండీఘర్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేపట్టింది.
పంజాబ్ బ్యాటర్లు ప్రారంభంలోనే తేలిపోయారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(30), ప్రియాంశ్(22) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శశాంక్ సింగ్ (18), నేహల్ వధేరా(10), బార్ట్ లెట్(11), మ్యాక్స్ వెల్(7) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0) డకౌట్ అయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు, అన్రిచ్ నోకికా, వైభవ్ తలో వికెట్ తీశారు.