Last Updated:

Skanda Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల “స్కంద” మూవీ రివ్యూ..

Skanda Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల “స్కంద” మూవీ రివ్యూ..

Cast & Crew

  • రామ్ పోతినేని (Hero)
  • శ్రీలీల (Heroine)
  • సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, 'కాలకేయ' ప్రభాకర్, దగ్గుబాటి రాజా, అజయ్ పుర్కర్, ఇంద్రజ తదితరులు (Cast)
  • బోయపాటి శ్రీను (Director)
  • శ్రీనివాసా చిట్టూరి (Producer)
  • తమన్ (Music)
  • సంతోష్ డిటాకే (Cinematography)
2.7

Skanda Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా.. రామ్ కి మాస్ హాట్ దక్కిందా ? లేదా ?? మూవీ రివ్యూ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

రుద్రకంటి రామకృష్ణం రాజు (శ్రీకాంత్) దేశంలోనే పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్. వేల కోట్లకు అధిపతి. అలాంటి వ్యక్తితో రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ పని పడుతుంది. కానీ దానికి ఆయన ఒప్పుకోడు. దాంతో అతడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు.. ఉరి శిక్ష కూడా వేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కర్) అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. ముహూర్తానికి కొద్ది క్షణాల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి (శరత్ లోహితస్వ) కుమారుడితో ఆమె లేచిపోయింది. స్నేహితులైన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. తన కుమార్తెను తీసుకు రావడానికి గునపం లాంటి కుర్రాడు (రామ్ పోతినేని)ని ఏపీ సీఎం పంపిస్తాడు. ఆ తన కుమారుడితో ఏపీ సీఎం కుమార్తె నిశ్చితార్థానికి తెలంగాణ సీఎం ఏర్పాటు చేస్తాడు. ఆ రోజే ఏపీ సీఎం కుమార్తెతో పాటు తెలంగాణ సీఎం కుమార్తె (శ్రీ లీల)ను కూడా రామ్ తనతో పాటు తీసుకువెళతారు. అసలు రుద్రకంటి కుటుంబం ఎవరు..? దానికి భాస్కర్ రాజుతో ఏంటి సంబంధం..? అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హీరోకు పంచాయితీ ఏంటి అనేది మిగిలిన కథ..

మూవీ విశ్లేషణ.. 

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రిలో మాస్ మూవీ తీయాలంటే గుర్తొచ్చే పేర్లలో బోయపాటి ఒకరు. లాజిక్ తో పనిలేకుండా ఊరమాస్ సినిమాలను తీస్తూ హిట్లు కొడుతున్నారు. ‘భద్ర’, ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు భారీ విజయాలు సాధించాయంటే.. లాజిక్ తో పని లేకుండా పబ్లిక్ ని మాస్ తో మ్యాజిక్ చేస్తున్నారు బోయపాటి అని అర్దం అవుతుంది. ఇక ఈ సినిమాలో కూడా తన రెగ్యులర్ ఫార్మాట్ నే ఆయన ఫాలో అయ్యారు. రెగ్యులర్ స్టోరీ కి ఊర మాస్ టచింగ్ ఇచ్చి మరోసారి హిట్ ని ఖాతాలో వేసుకున్నారు అని చెప్పవచ్చు.

రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమా అయినా కూడా పాస్ మార్కులు వేయించుకుంటుంది స్కంద. సీఎం ఇంటికి హీరో ట్రాక్టర్ వేసుకొని రావడం.. రెండు రాష్ట్రాల సీఎంలు వీధి రౌడీల్లా మందను వెంటబెట్టుకొని హీరో చేతిలో తన్నులు తినడం.. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో స్కంద సినిమాలో ఉన్నాయి. తల తోక లేని సీన్స్ ఇన్ని ఉన్నా కూడా మాస్‌కు కనెక్ట్ అయ్యే కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా సోసోగా ఉంటుంది.. పొలిటికల్ పంచులతో ముందుకు వెళుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.. అది కూడా రొటీన్ కథే. పైగా ఈ సినిమా కథ చూస్తుంటే ఎందుకో సత్యం రామలింగరాజు కథ గుర్తుకొస్తుంది. ఆయన కథతోనే ఈ స్టోరీ రాసుకున్నారేమో అనిపిస్తుంది.

Skanda | మాస్ చూపించి ఫ్యామిలీస్ ను రమ్మంటారేంటి? | Wrong Promotion on Ram  Pothineni's Skanda Movie

ప్రీ క్లైమాక్స్ వరకు భారంగా నడిచిన కథ క్లైమాక్స్‌లో ఒక్కసారిగా పైకి లేచింది. ట్విస్ట్ రొటీన్ అయినా కూడా బోయపాటి ఎలివేషన్‌తో రేంజ్ పెరిగింది. ఫస్టాఫ్‌లో రామ్, శ్రీలీల మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.  రామ్ ఇంట్రో గానీ, ఆ తర్వాత సినిమాలో యాక్షన్ సీన్లు గానీ మాస్ జనాలను మెప్పిస్తాయి. ఆ యాక్షన్ దృశ్యాలకు తమన్ అందించిన నేపథ్య సంగీతం సైతం బావుంది. బోయపాటి గత సినిమాల్లో ఉన్నటువంటి బలమైన కథ, కథనాలు లేవు ఇందులో లేవని మాత్రం చెప్పాలి.  ఇక లాజిక్స్ గురించి అసలు ఆలోచించక పోవడం మంచిది.

ఎవరెలా చేశారంటే.. 

రామ్ పోతినేని ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత మాస్ రోల్ చేయలేదని చెప్పాలి. తండ్రికి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు పణంగా పెట్టే యువకుడిగా మెప్పించారు. యాక్షన్ సీన్లలో అయితే విధ్వంసం చూపించారు. శ్రీ లీల పాత్ర పరిధి మేరకు మెప్పించింది. పాటల్లో డ్యాన్సులు ఇరగదీశారు. సయీ మంజ్రేకర్ కథలో కీలక పాత్ర అనే చెప్పాలి. ఆమె పాత్రకు న్యాయం చేసింది. అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. రామ్ పోతినేనిని మాస్ హీరోగా ప్రజెంట్ చేయడంలో మాత్రం బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం కమర్షియల్ శైలిలో ఉంది. పాటలు ఆశించిన రీతిలో లేవు. సినిమాటోగ్రఫీ సూపర్.

కంక్లూజన్.. 

లాజిక్ పక్కన పెట్టి మాస్ మూవీ కావాలంటే తప్పక చూడవచ్చు..

ఇవి కూడా చదవండి: