చంద్రబాబు: ముందుస్తు ఎన్నికలపై చంద్రబాబు మాట నిజం కానుందా.. జగన్ సర్కార్ ప్లాన్ ఏంటి..?
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ మదిలో ఏముంది? ముందస్తుకు వెళ్లే ప్రసక్తేలేదని వాళ్లిద్దరూ చెబుతున్నా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఎందుకు ప్రచారం జరుగుతోంది.
Chandra Babu: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ మదిలో ఏముంది? ముందస్తుకు వెళ్లే ప్రసక్తేలేదని వాళ్లిద్దరూ చెబుతున్నా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఎందుకు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అయితే.. నిత్యం ముందస్తు ఎన్నికల జపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? .. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..
ఇటీవల కాలంలో చంద్రబాబు తరచూ ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చెప్తూ వస్తోన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయనకు వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సమాచారం వచ్చి ఉండాలి అంటున్నారు. అది పక్కా అయితేనే చంద్రబాబు ప్రకటిస్తారని ప్రజలంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పక్కా వ్యూహంతోనే ముందస్తు ఎన్నికలు ఉంటాయని ఆయన చెబుతూ వస్తున్నారు.
సజ్జల ఏం అంటున్నారు..
జగన్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు, ఇరుకున పెట్టేందుకు, ప్రజల్లో బలహీనం చేసేందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ముందస్తు ఎన్నికలంటూ ఏవీ లేవని.. తాము షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ కు వెళతామని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం నుంచి ముందస్తు ఎన్నికలపై ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేకున్నా చంద్రబాబు మాత్రం ఆ మాటను విడిచిపెట్టడం లేదు. దానితో చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారన్న టాక్ నడుస్తోంది.
బలహీనతను కప్పిపుచ్చేందుకే ముందస్తు
సహజంగా ముందస్తు ఎన్నికలు అనేవి పాలక పక్షం బలహీనతను తెలియజేస్తాయి. పూర్తిస్థాయి పదవీ కాలం పూర్తిచేసే నాటికి ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతుందని గ్రహించి అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుంది. లేకుంటే తమకు అనుకూలమైన సమయమని భావించి ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధపడతారు. అయితే జగన్ సర్కార్ అనుకూలత చూపించేటంతగా ఏపీలో ప్రభుత్వ పాలన సాగలేదు. అలాగని ఐదేళ్ల సమయం పూర్తయ్యే వరకూ ఉంటే ప్రతికూలతాంశాలు పెరిగే అవకాశముంది.. కానీ తగ్గే సూచనలు లేవు. కానీ జగన్ నుంచి ఎటువంటి ముందస్తు చర్యలు లేవు. అటువంటి సంకేతాలు కనిపించడం లేదు. పైగా ఎమ్మెల్యేలు, మంత్రుతో నిర్వహించిన వర్కుషాపుల్లో సైతం దీనిపై జగన్ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ చంద్రబాబు హడావుడి చూస్తుంటే మాత్రం అనుమానం కలుగతోందన్న టాక్ నడుస్తోంది.
చంద్రబాబు వ్యూహం ఏంటి
మరోవైపు.. ముందస్తు ఎన్నికలుంటాయని ప్రచారం కల్పించడం ద్వారా జగన్ మరింత బలహీనం చేయాలన్నదే చంద్రబాబు వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించాలన్నదే బాబు లక్ష్యంగా కనిపిస్తోందట. తద్వారా ప్రజల్లో కూడా జగన్ పరపతి తగ్గుతుంది. ప్రజా వ్యతిరేకత మరింత పెంచినట్టవుతుంది అని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. పాలనా వైఫల్యాలను అధిగమించలేక జగన్ చేతులెత్తేశారన్న టాక్ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ముందస్తు ప్రచారంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు గత ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి చవిచూసింది. దానితో తెదేపా శ్రేణుల్లో నిరాశ నెలకొంది. వారిని తట్టి కార్యొన్ముఖులు చేయాలన్న తలంపులోభాగంగా చంద్రబాబు పదేపదే ముందస్తు అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పైగా కేసులు, వేధింపులతో చాలామంది టీడీపీ నాయకులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అటువంటి వారికి ఇంకెంత కాలం ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయని.. యాక్టివ్ చేయడానికి ముందస్తు అన్నది ఒక కారణంగా చూపడానికి చంద్రబాబు ప్రయత్నంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు ముందస్తు హెచ్చరికలతో అటు ప్రత్యర్థికి హెచ్చరికలు జారీచేయడమే కాకుండా డిఫెన్స్ లోపడేస్తున్నారు. ఇటు నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముందుస్తు ఎన్నికలు వచ్చేనా లేదా అనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: టార్గెట్ 2024… జనసేనాని పవన్ కళ్యాణ్… పంచతంత్ర వ్యూహం ఫలిస్తుందా ?