Home / పొలిటికల్ వార్తలు
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు
మునుగోడులో కొద్ది రోజులుగా స్థబ్దతుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. నేతలంతా ఒక భావోద్వేగ పూరిత వాతావరణంతో ఒక్కతాటి పైకి వస్తున్నారు. అగ్రనేత రాహుల్‌గాంధీని స్ఫూర్తిగా తీసుకుని మునుగోడు సిట్టింగ్ స్థానం పై కాంగ్రెస్ జెండా
ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.
ఆప్ అంటే "అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ" అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత అజోయ్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్న ఆప్‌ని అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ, అరవింద్ యాక్టర్స్ పార్టీ, అరవింద్ ఐష్ పార్టీ అని పిలవాలని అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజనతో అనుసంధానమైన మహిళలకు త్వరలో ఉచిత ఇంటర్నెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ ప్రకటించారు
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపి రెబల్ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు నిత్యం రాష్ట్రంలోని పరిస్ధితులను కేంద్రానికి చేరవేసేందులో ప్రతిపక్షం కన్నా ముందుంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టు ఉత్తర్వులను సైతం ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షాకు లేఖ వ్రాయడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వ్యంగ విమర్శలు గుప్పించారు.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ నవన్న ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించకముందే ప్రతిపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో పోలీసులతో సువేందు వాగ్వాదానికి దిగారు