Home / పొలిటికల్ వార్తలు
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
నందిగామ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిపై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపధ్యంలో దీనిపై నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీలో టీకాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు.
నవంబర్ 1న సీల్ట్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చిన్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
మీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఇప్పటి వరకు మీకే క్లారిటీ లేదంటూ బీజేపీ నేత డీకే అరుణ టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితంచేసేలా, ఎంతో ఆసక్తి కల్గించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 92శాతం పోలింగ్ నమోదైంది.