Home / పొలిటికల్ వార్తలు
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పందంగా ఉందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Munugode By Poll Result Counting Live Updates:: మునుగోడులో గెలిచ్చేదేవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు.
మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 పాటల కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.