Home / పొలిటికల్ వార్తలు
ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పాల్గొనమంటూ దివంగత ప్రధాని పీవీ కుటుంబ సభ్యలును ఆహ్వానించారని పీవీ మనవడు ఎన్ వి సుభాష్ తెలిపారు.
వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు.
కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తుని టీడీపీ సీటు కూతురికి ఇస్తున్నట్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంకేతాలు ఇచ్చారు.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం తిరిగి విచారణ ప్రారంభించింది.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా అనుచరుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షను ప్రారంభించారు.
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రం ఎక్కారు.