Last Updated:

Mallikarjun kharge: ‘మల్లికార్జున ఖర్గేను చంపేందుకు కుట్ర‘.. ఆడియో క్లిప్ కలకలం

మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

Mallikarjun kharge: ‘మల్లికార్జున ఖర్గేను చంపేందుకు కుట్ర‘.. ఆడియో క్లిప్ కలకలం

Mallikarjun kharge: మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చంపేందుకు భారతీయ జనతా అభ్యర్థి కుట్ర పన్నారంటూ ఆ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓ ఆడియో క్లిప్ విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సదరు ఆడియోను పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సూర్జేవాలా ఆడియెను రిలీజ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది.

 

ఆడియోలో ఏముందంటే..(Mallikarjun kharge)

కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మణికంఠ రాథోడ్ పోటీ చేస్తున్నారు. అయితే, సదరు అభ్యర్థి మాట్లాడినట్లుగా ఓ ఆడియోను సూర్జేవాలా మీడియా సమావేశంలో బయటపెట్టారు. ‘మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తా’అని రాథోడ్‌ కన్నడలో అన్నట్లుగా ఆడియోలో స్పష్టంగా ఉంది. ‘ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నేతలు హత్యకు సైతం కుట్ర పన్నుతున్నారు’అని సూర్జేవాలా ఆరోపించారు.

 

అది ఫేక్ ఆడియో: మణికంఠ రాథోడ్(Mallikarjun kharge)

కాంగ్రెస్‌పై కన్నడ ప్రజలు చూపుతున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక చివరికి హత్యా రాజకీయాలకు బీజేపీ తెరలేపిందన్నారు. రాథోడ్‌కు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అండదండలు బాగా ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను రాథోడ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ చెప్పేవి అబద్ధమని.. అది ఓ ఫేక్‌ ఆడియోగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే లేని ఆరోపణలు మోపుతున్నారన్నారు. చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే పోటీ చేస్తున్నారు. ఆయనపై 26 ఏళ్ల మణికంఠ రాథోడ్‌ను బీజేపీ బరిలో నిలిపింది. మే 10న కర్ణాటకలోని అన్ని స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసింది.