Home / జాతీయం
కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
: సాయుధ దళాలలోని మహిళా సైనికులు, నావికులు మరియు వైమానిక దళంలో పనిచేసే మహిళలకు అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ మరియు పిల్లల దత్తత సెలవుల నిబంధనలను పొడిగించే ప్రతిపాదనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు
దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఆదివారం X (గతంలో ట్విట్టర్)లో ఈ ప్రకటన చేశారు.
Delhi: ఢిల్లీలో మరోసారి కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాదస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం వాయునాణ్యత సూచీ 346గా నమోదయింది.
బిగ్ బాస్ OTT 2 విజేత మరియు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నిర్వహించిన రేవ్ పార్టీలకు పాములు, వాటి విషాన్ని సరఫరా చేసినందుకు ఐదుగురు వ్యక్తులను నోయిడాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లోని వివిధ ఫామ్‌హౌస్‌లలో ఈ పార్టీలు నిర్వహించారు.
దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు క్యాష్ ఫర్ క్వరీ అంశంపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేసారు. కమిటీ శ్రీమతి మొయిత్రాను వ్యక్తిగత మరియు అనైతిక ప్రశ్నలు అడిగారని ప్రతిపక్ష ఎంపీలు చెప్పారు.
కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో సంక్షోభాన్ని తగ్గించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు
సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ కేసులు నమోదయి వ్యక్తులను విచారణకు పిలవడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈడీ అధికారులే లంచం తీసుకున్నారంటే వ్యవస్ద ఎలా ఉందో తెలుస్తుోంది. లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.