Home / జాతీయం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో నవంబర్ 12న కూలిపోయిన తర్వాత అందులో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి, ఇందులో భాగంగా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి ఆరు ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.
గుజరాత్లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పిడుగులు పడి 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్ఈఓసీ ) అధికారి ఈ విషయాన్ని తెలిపారు.
ఆడవారి పై దాడి .. ఒకప్పుడు ఈ మాట వింటే అంతా షాక్ అవ్వడం ,కోపంతో ఊగిపోవడం చూసేవాళ్ళం.కానీ ఇప్పుడు దాడి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న వయసులోనే ఆడవారి పై దాడులకు ఒడిగడుతున్నారు. చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం మరియు ఆసుపత్రుల సన్నద్ధతను సమీక్షించాలని కేంద్రం ఆదివారం రాష్ట్రాలను కోరింది. ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని ఇటీవలి నివేదికల దృష్ట్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఈ ప్రకటన వచ్చింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.
తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ వ్యాప్తి, చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోట్ విడుదల చేసింది.
నేటి కాలంలో మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భార్యని, కన్న కూతుర్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. భార్య, కుమార్తెను పక్కా ప్లాన్ తో హతమార్చి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.