Home / జాతీయం
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2023లో మొత్తం 125 దేశాలకు గాను ఇండియా 111 ర్యాంకులో నిలిచింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ నివేదకను తప్పుబడుతోంది. ఏ గణాంకాల ప్రకారం ఈ నివేదికను తయారు చేశారని ప్రశ్నించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల నాటి ఈ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ మరణశిక్షను ధ్రువీకరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. అతను శివుని పవిత్ర నివాసంగా భావించే ఆది కైలాస శిఖరం నుండి తన పర్యటనను ప్రారంభించారు. పార్వతి కుంద్ లోని ఆది కైలాస శిఖరం వద్ద ప్రార్థనలు చేశారు. తెల్లటి వస్త్రాలు ధరించిన మోదీ స్దానిక పూజారులు వీరేంద్ర కుటియాల్ మరియు గోపాల్ సింగ్ ల సూచనల మేరకు పూజలు నిర్వహించారు.
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజుల్లో ఈ ఆసుపత్రిలో మరో 108 మరణాలు సంభవించాయి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు.