Ayodhya Ram Temple Ceremony: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి దూరంగా కాంగ్రెస్
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
Ayodhya Ram temple Ceremony: ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ షో అని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ షో..(Ayodhya Ram Temple Ceremony)
గత నెలలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరికి అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు అందాయి. అయితే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్‌రంజన్ చౌదరిలు తమ అందిన ఆహ్వాన పత్రికను గౌరవ ప్రదంగా తిరస్కిరస్తున్నామని ఒక ప్రకటనలో వివరించారు. దీనితో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరువుతారా లేదా అనే సస్పెన్స్ వీడిపోయింది. రాముల వారిని దేశంలోని లక్షలాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మతం అనేది వ్యక్తిగత అంశంమని… అయితే బీజేపీ/ ఆర్‌ఎస్ఎస్‌లు అయోధ్యలోని రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పూర్తి కానీ దేవాలయానికి ప్రారంభోత్సవం చేయడం అంటే బీజేపీ/ ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ లబ్ధి కోసమే దేవుడిని కూడా వదలడం లేదని విమర్శించింది.
రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరణ..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి బుధవారం నాడు మరో దెబ్బతగిలింది. ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరించింది. కాగా రాహుల్ మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ డిస్ర్టిక్ నుంచి తన యాత్ర ప్రారంభించాల్సి ఉంది. దీనికి మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రెసిడెంట్ కైషామ్ మెగచంద్ర రాష్ర్టప్రభుత్వం అనుమతి కోసం ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని .. ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను కలిసి భారత్ జోడో న్యాయయాత్రకు అనుమతించాలని కోరామని రాష్ర్ట పీసీసీ చీఫ్ చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించారని కైషామ్ మెగచంద్ర తెలిపారు. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పాయని ముఖ్యమంత్రి చెప్పారని పీసీసీ ప్రెసిడెంట్ చెప్పారు.