Home / జాతీయం
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులందరి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిరంతరం కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 2 కి.మీ మేర ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మనోధైర్యాన్ని ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలరీ గ్రూప్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. బీజేపీని తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ (58) ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చేవారం చెన్నైలో ఈడీ ఎదుట హాజరుకావాలని కోరారు.
:హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మొదట్లో 60 మంది విద్యార్థినులు అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరుకుంది. లైంగిక వేధింపుల కమిటీ విచారణలో ఈ విషయం వెల్లడయింది.
దేశ రాజధాని ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో రూ.350 దోపిడీకి పాల్పడిన ఘటనలో ఒక యువకుడిని మైనర్ దారుణంగా హత్య చేసాడు. మంగళవారం రాత్రి 11.15 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.నిందితుడు, తాగి , కత్తితో పొడిచి, తర్వాత బాధితుడి మృతదేహం పక్కన నృత్యం చేశాడు.
డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోలు మరియు వాటిని హోస్ట్ చేసే ప్లాట్‌ఫారమ్‌ల సృష్టికర్తలకు జరిమానా విధించబడుతుందని ఆయన తెలిపారు.
సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
రేమాండ్ సీఎండి గౌతమ్ సింఘానియా భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే రేమాండ్ షేర్లు స్టాక్ మార్కెట్లో గణనీయంగా తగ్గముఖం పట్టడం మొదలయ్యాయి. వరుసగా ఏడు రోజుకూడా రేమాండ్ షేర్లు నేల చూపులు చూశాయి. భార్య నవాజ్ మోదీ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకొని బయటపడుతున్నారు.
యాడ్స్‌లో తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లపై యోగా గురువు రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేదాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఒక నిర్దిష్ట వ్యాధిని నయం చేయగలదని తప్పుడు క్లెయిమ్ చేస్తే, ప్రతి ప్రొడక్టుపై రూ. 1 కోటి రూపాయలు జరిమానా విధించబడుతుందని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి కఠినవ్యాఖ్యలు చేసింది రైతులను విలన్లుగా చేసి తమ మాట వినడం లేదని చెప్పింది. పంట వ్యర్దాలను తొలగించడాన్ని పంజాబ్ ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.