Home / జాతీయం
కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావుతో పాటు మరో నలుగురిపై నమోదైన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 (పోక్సో) కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రతీక్ అనే 13 ఏళ్ల బాలుడు భావోద్వేగాలతో కూడిన రోబోను రూపొందించాడు. అతను తన రోబోకు 'రఫీ' అని పేరు పెట్టాడు మరియు ఇది సాధారణ ప్రశ్నలకు ప్రతిస్పందించడంతో పాటు తిట్టడం మరియు ఇతర మానవ భావాలను అర్థం చేసుకుంటుంది.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.