Home / జాతీయం
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.
భారతదేశం సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు నగరం దేశంలోని ప్రముఖ సమాచార సాంకేతిక ఎగుమతిదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరం, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమయింది.
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అంటే తెలియని వారు లేరు. అలాంటి సాంకేతికతను ఉపయోగించని వారు కూడా తక్కువనే చెప్పాలి. కాలక్షేపానికో, లేదా ఇతరులను ఇరకాటంలోకి నెట్టేందుకు రూపాయి ఖర్చులేకుండానే సోషల్ మీడియా అరిచేతిలో వైకుంఠం మాదిరిగా నేటి జీవన స్రవంతిలో ఒకటిగా మారిపోయింది.
దేశాన్ని రక్షించుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందుకోసం లక్షలాది మంది సైనికులు నిరంతరం పహారా కాస్తుండడం ఒక వంతైతే, దేశ రక్షణకు సంబంధించిన సాంకేతిక, ఆయుధాలు, వాహనాలు, రాకెట్లు, మిస్సైల్స్ వంటి తయారీ కూడా ఎంతో కీలకం.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ఇటీవల ఢిల్లీ పర్యటన పై విలేకరులు ప్రశ్నించగా వారికి ఊహించని సమాధానం ఎదురయింది. నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాను.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.
జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో గురువారం ఉదయం రిక్టర్ స్కేలు పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన నివేదికలో పేర్కొంది. కత్రా కు 62 కిమీ తూర్పు-ఈశాన్యం దిశగా ఉదయం 07:52 గంటలకు సంభవించింది.
ఇళ్లన్నాక గొడవలు సహజం. అందులోనూ అత్తాకోడళ్లు అయితే మరి చెప్పనక్కర్లేదు. అత్తాకోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేసిన భగ్గుమంటుంది అన్న నానుడి ఊరికే రాలేదండోయ్. కొన్ని కలహాలు కుటుంబాన్ని చీల్చితే, మరికొన్ని ప్రాణాలను కూడా తీస్తుండడం మనం ఇటీవలె కాలంలో చూస్తూనే ఉన్నాం.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ సమీపంలో గురువారం పసికందు మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత, పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న బాలిక ద్వారా శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు.