Home / జాతీయం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
దేశంలో పదవీ విరమణ వయస్సు పెద్ద చర్చగా మారుతుంది. సామాన్య ఉద్యోగుల దగ్గర నుండి మేధావుల వర్గాల వరకు పదవీ విరమణ వయస్సుపై పలు అంశాలు పదవీ విరమణ వయస్సు పెంపుపై సాగుతున్నాయి.
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలంటుకోవడంతో విమానం నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. మస్కట్ నుంచి కోచికి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సందర్భంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతాపార్టీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలన్ని తోసి పుచ్చుతోంది.
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐాఆర్ సిటిసి ) బుధవారం భారత్ గౌరవ్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పైలట్లు మరియు క్యాబిన్ సిబ్బందితో సహా విమానయాన సిబ్బంది అక్టోబర్ 15 నుండి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ఈమేరకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీకి వెల్లతారు. అక్కడే నివాసం ఉండాలంటారు. అది కూడా అప్పనంగా ప్రభుత్వం నివాసమే కావాలంటారు. ఇది నేటి ప్రజా ప్రతినిధుల తీరు. అలాంటి వారికి ఢిల్లీ కోర్టు ఒప్పుకొనేది లేదంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
కేరళ ప్రభుత్వం సోమవారం నాడు, కపికో కేరళ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిద్వారా అలప్పుజలో రూ. 200 కోట్ల విలువైన సెవెన్ స్టార్ రిసార్ట్ కూల్చివేతకు రంగం సిద్దమయింది.