Home / జాతీయం
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్‌ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్'గా అంకితం చేశారు.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
వెస్ట్ బెంగాల్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారి పై దాడులు చేపట్టింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గేమింగ్ యాప్ పేరుతో యూజర్లు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కోణంలో ఇడి దర్యాప్తు చేపట్టిన కేసులో నోట్ల కట్టలు బయటపడ్డాయి.
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
ఎగుమతులు అసాధారణంగా పెరగడం, దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గడం వంటి కారణాలతో నూకలు (విరిగినబియ్యం) ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. నూకల ధర ధర సుమారు రూ. 15-16 (కిలోకి) మరియు తరువాత రూ. 22కి పెరిగింది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం 15 రాష్ట్రాల ఇన్ఛార్జ్లు మరియు కో-ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సాల్‌ను తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాతో సహా మూడు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది.
కాంగ్రెస్ 'భారత్ జోడో' ప్రచారం రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి బిజేపీకి మరో అవకాశాన్ని ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాస్టర్ అయిన జార్జ్ పొన్నయ్య మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.
ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఎఐసిసి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పార్టీ చీఫ్ ఎన్నిక యొక్క "పారదర్శకత మరియు నిష్పాక్షికత" గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.