Home / జాతీయం
కాంగ్రెస్ సోమవారం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఖాకీ షార్ట్‌లను తగులబెట్టిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. పోస్ట్ చేసిన చిత్రంలో, ఆర్ఎస్ఎస్ నిక్కర్ కాలుతూ దాని నుండి పొగ కూడా పైకి లేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు.
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా కలిసారు.
ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేయడంలో జరిగిన అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు రంగం సిద్దమయింది. జూన్‌లో అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేశారు.
జ్ఞాన్వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముఠాలు మరియు క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) సోమవారం భారతదేశంలోని 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఢిల్లీహర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.
ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గాను గత నెల 28న పరీక్షలు నిర్వహించగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నేడు ఫలితాలను విడుదల చేసింది.
రాహుల్ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తామని ముందుకు వచ్చిన తమిళ మహిళలు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు... అసలు ఈ సన్నివేశం ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.