Home / జాతీయం
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్‌పూర్ హైవే పై భరత్‌కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
బీహార్‌లోని ముజఫరా పూర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు దోచుకుపోయారు. సదర్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోబర్‌షాహి బ్రాంచిలో ఈ సంఘటన జరిగింది.
రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా... మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా... ఈ ఎంపీ చీర కట్టులో ఫుట్‌బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.
ఢిల్లీలో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి, గత వారంలో 100 మందికి పైగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు నగరంలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క సంఖ్య దాదాపు 400కి చేరుకుంది.
నిందితులకు తగిన గుణపాఠం పేరుతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్య నాధ్ తీసుకొచ్చిన బుల్ డోజర్ వ్యవస్ధను భాజాపా మద్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరిచింది. ఈమేరకు ఓ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందుతుల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చివేసి ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
జిలేబీ దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందిన స్వీట్ . అయితే జంబో-సైజ్ జిలేబీని రుచి చూడాలంటే, మీరు బంకురా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంజకురా గ్రామాన్ని సందర్శించాలి.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌లో ఆదివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది
రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది.
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు.