Home / జాతీయం
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
జార్ఖండ్ లో ఆర్మీ కల్నల్ మరియు అతని కుమారుడిని దీపావళి రోజున బాణసంచా కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ విషయమై గోండా పోలీస్ స్టేషన్లో ఆర్మీ కల్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ ఫిర్యాదు చేశారు.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు. మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ, రెండు కాళ్లు, నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
సాధారణ రెస్టారెంట్లలో భోజనం చేయడం రొటీన్ గా మారిందా? ఇటువంటివారికోసం భారతీయ రైల్వే ఒక వినూత్నమైన రెస్టారెంట్ ను ప్రారంభించింది.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. గొడవపడిన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాస్తైన ప్రేమ ఉన్న వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం భార్య ఉరిపోసుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల పై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యవసానాలను చవిచూడాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వైమానిక దళం ఆద్వర్యంలో శ్రీనగర్ లో చేపట్టిన శౌర్య దివస్ కార్యక్రమంలో పాకిస్థాన్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రేప్ కేసులో శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం పెరోల్ పై బయట ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్‌పై ప్రస్తుతం తన దత్తపుత్రిక హనీప్రీత్‌కు ‘రుహానీ దీదీ’ అనే కొత్త పేరును ప్రకటించారు
కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉన్న కార్యాలయాల్లో పడి ఉన్న స్క్రాప్ ను రూ. 254 కోట్లకు విక్రయించి 37 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని క్లియర్ చేసింది.
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. కాగా పన్ను కట్టడానికి ప్రభుత్వం ఒక గడువును నిర్ణయిస్తుంది. ఆ గడువులోగా పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపు గడువును పెంచింది.