Home / జాతీయం
తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. సింగపూర్ ఆసుపత్రిలో తన తండ్రి లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని లాలూ కుమార్తె మిసా భారతి ట్వీట్ చేశారు. లాలూ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేసింది.
పూరీ శ్రీ జగన్నాథ దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బెంగాలీ యూట్యూబర్ అనిమేష్ చక్రవర్తిపై కేసు నమోదయింది.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
బీహార్‌లో మద్యం వినియోగం దేవుడిలాంటిదని, అది కనిపించదని, సర్వత్రా ఉందని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. గుజరాత్ ఎన్నికలరెండవ దశ పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పోలింగ్ బూత్‌కు వెళుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ క్యూలో నిలబడి ఓటు వేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు ప్రధాని ఆహ్వానం లభిచిందింది.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు.