Home / జాతీయం
ఈ ఏడాది జూలైలో చంద్రయాన్-3ని ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహం NSV-01 విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేసారు.
దేశరాజధాని ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఒక యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి బండరాయితో తలపై మోది చంపాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ హత్య సీసీటీవీలో రికార్డయింది. మృతురాలిని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీకి చెందిన సాక్షిగా గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్‌లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లు మరియు ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఈ ఉదయం బెంగుళూరులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె అన్నారు. అనంతరం మహానేత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని శివకుమార్ గుర్తు చేశారు.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌కు నీటిపారుదల మరియు బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను కేటాయించగా ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకున్నారు
ఆదివారం మణిపూర్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలు మరియు పౌరులపై కాల్పులు జరిపిన సందర్భాల్లో ఒక పోలీసుతో సహా కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు భారత సైన్యం కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ప్రారంభమైంది.