Last Updated:

Dream 11: రూ.49తో డ్రీమ్ 11 బెట్టింగ్.. కోటిరూపాయలు జాక్ పాట్ కొట్టేసాడు..

డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

Dream 11: రూ.49తో డ్రీమ్ 11 బెట్టింగ్.. కోటిరూపాయలు జాక్ పాట్ కొట్టేసాడు..

Dream 11: డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన రాజు రామ్ డ్రీమ్ 11 అనే యాప్‌లో క్రికెట్ గేమ్ కోటి రూపాయలు గెలుపొందాడు. దీంతో కుటుంబసభ్యులు చాలా సంతోషించారు. గెలిచిన మొత్తం అతని ఖాతాకు బదిలీ చేయబడింది. గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 ప్లేయింగ్ యాప్‌లో గేమ్ ఆడుతున్నట్లు రాజు చెప్పాడు. తాజాగా బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్లో రూ.49 పెట్టి గేమ్ ఆడాడు. ఈ ఇందులో అగ్రస్థానంలో నిలిచి కోటిరూపాయలు సంపాదించాడు.

అప్పుడప్పుడు చిన్న మొత్తంలో కూడా గెలుస్తూ ఉండేవాడినని రాజు చెప్పాడు. రాజు తన గ్రామంలోనే డీజే ఆపరేషన్‌ చేసేవాడు. దీంతో పాటు దుకాణం కూడా నడుపుతున్నాడు. కానీ, ఇంతలో రాజు రామ్ ఫేట్ రాత్రికి రాత్రే మారిపోయింది. తాను గేమ్ ఆడుతున్న సమయంలో దాదాపు 35 లక్షల మంది ఒకేసారి ఆ గేమ్‌ను ఆడేవారని రాజు చెప్పారు. అతను బ్రిస్బేన్ హీట్ మరియు సిడ్నీ థండర్ జట్టు నుండి ఆటగాళ్లను ఎంపిక చేసి ఒక జట్టును తయారు చేసి, గెలిచి కోటి రూపాయలు గెలుచుకున్నాడు.

ఇంతకు ముందు బీహార్‌లోని అర్రాలో, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ డ్రీమ్-11 నుండి ఒక వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అర్రా జిల్లా చార్పోఖారీ బ్లాక్ ఠాకూరి గ్రామానికి చెందిన వెంకటేష్ సింగ్ కుమారుడు సౌరభ్ కుమార్ డ్రీమ్-11 విజేతగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి: