Home / జాతీయం
మధ్యప్రదేశ్‌లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్ల మోటర్‌బైక్‌లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్ కు చెందిన ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ శనివారం ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలోని గురుద్వారాలో వివాహ వేడుక జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ బుధవారం ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. తమ బెయిల్ బాండ్ల కోసం చెల్లించలేని ఖైదీలు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం తాను రూ. 5.11 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందిస్తానని దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు.
దాదాపు ఏప్రిల్ నెలలో బ్యాంకులు సగం రోజులు సెలవుల్లోనే ఉంటాయి. అయితే ఆన్లైన్ సేవలు, యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్‌ను కూడా మోదీప్రారంభించారు.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సైతం తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్ఐసీపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్ కు అన్ని ఆధారాలను సమర్పించాను. లండన్ పర్యటన పై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు అతని వివాదాస్పద ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు సంబంధించినది. ఇది అతనిపై కేసు నమోదు చేయడానికి దారితీసింది.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితా ప్రకారం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.