Home / జాతీయం
ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితుల ద్వారా దాదాపు రూ.250 కోట్లు సంపాదించారు. రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతుండడంతో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుకోవచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది.
బీహార్ లో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడిపించే జైలు నిబంధనలను సర్దుబాటు చేయడానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యపై సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల అసోసియేషన్ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది, ఇది న్యాయ నిరాకరణతో సమానం అని పేర్కొంది.
: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసం సుందరీకరణ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనం దేశ రాజధానిలో రాజకీయ దుమారం రేపింది.ఈ నివేదికపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విపక్షాలు- కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా మండిపడ్డారు.
శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ మృతి చెందారు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈయన తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. కాగా 95 ఏళ్ల వయసున్న ప్రకాష్ సింగ్ గతంలో 5 సార్లు పంజాబ్ సీఎం గా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా గత వారమే ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌కు సంబంధించి లక్నో పోలీసులు మంగళవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రియురాలి తండ్రిపై విసుగు చెందిన ఓ ప్రేమికుడు చేసిన పనేనని ఇప్పుడు తేలింది.
పదకొండవ జ్యోతిర్లింగమయిన కేదార్నాథ్ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం పూజలతో తెరవబడ్డాయి.ఈ మందిరంలో మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ పేరిట చేశారు.
Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్ సింగ్.. ఇపుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. భారత స్టార్ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తుంది ఈయనపైనే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ ఉన్నారు.
పులుల నిర్వహణను శాస్తీయంగా చేసే ప్రయత్నంలో భాగంగా సుందర్బన్ టైగర్ రిజర్వ్ (STR) జోన్‌తో మరో మూడు అటవీ శ్రేణులను విలీనం చేసే అవకాశం ఉంది. అటవీ శాఖ అధికారుల ప్రకారం, ఈ జంతువుల ఆవాసాలను రక్షించడం మరియు వాటి సంరక్షణను ప్రోత్సహించడం ఈ విస్తరణ లక్ష్యం.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై విరుచుకుపడ్డారు.తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కాకపోతే, ఆయన మెరిట్ ఆధారంగా ఈ దేశంలో ఏ ఉద్యోగం వచ్చేది కాదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. భారతదేశం వెలుపల ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి.