Home / జాతీయం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు, అతను వయనాడ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగితే, అమేథీ పట్టిన గతే ఈ నియోజకవర్గానికి పడుతుందని హెచ్చరించారు.
లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరింది.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. జీ20 సమ్మిట్‌లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కు డ్రైవర్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు, వారి మన్ కీ బాత్ వినేందుకు వెళ్లారు. పార్టీ ట్వీట్ చేసిన విజువల్స్‌లో, గాంధీ ట్రక్కులో కూర్చొని, డ్రైవర్లలో ఒకరితో ప్రయాణిస్తూ మరియు ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతూ కనిపించారు.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై గుజరాత్‌కు చెందిన ఎన్జీవో 10,000 కోట్ల నష్టపరిహారం కోసం దావా వేసింది. డాక్యుమెంటరీ ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలను చేస్తోందని ఎన్జీవో పేర్కొంది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి యూనిట్ మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ను జూన్ 8 వరకు అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.వాంఖడేకు ఉపశమనం కల్పించే ముందు హైకోర్టు కొన్ని షరతులు విధించింది.