Home / జాతీయం
కోల్‌కతాకు చెందిన ఒక లెస్బియన్ జంట సోమవారం సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. హల్దీ, సంగీత్, మెహందీ మరియు ఫెరాస్తో సహా అన్ని సాంప్రదాయ బెంగాలీ ఆచారాలతో వీరి వివాహం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.
భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు
ఆదివారం న్యూ ఢిల్లీలో భారతదేశం యొక్క కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని 19 రాజకీయపార్టీలు ప్రకరటించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), వామపక్షాలు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), జనతాదళ్-యునైటెడ్ (జెడియు), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం బుధవారం ఈ విషయాన్ని తెలిపారు.
దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కా, తమ్ముడు చివరకు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వృద్ధాప్యం వల్ల వీల్ చైర్‌కు పరిమితమైన వారిద్దరూ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే ఫార్ములా లేదని తన సహచర మంత్రి ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు.
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్‌లైట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.