Home / జాతీయం
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో తాజాగా ఘర్షణలు చెలరేగడంతో సైన్యం మరియు పారామిలటరీ బలగాలను మోహరించారు ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీలు ఘర్షణ పడ్డాయి. స్థానిక మార్కెట్లో స్థలం విషయంలో గొడవలు మొదలయ్యాయి.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన బాలికలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రెజ్లర్ వినేష్ ఫోగట్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను.నేను మాత్రమే కాదు, ఫిర్యాదు చేసిన అమ్మాయిలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం నోట్ల మార్పిడి కి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో నోట్ల మార్పిడి కోసం ప్రజల కోసం నీరు, నీడ లాంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.
బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని ఆవు మూత్రంతో శుభ్రపరిచారు. అవినీతి బిజెపి పాలన ముగిసిన నేపధ్యంలో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘జీరో ట్రాఫిక్’ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ఆదివారం బెంగళూరు పోలీసులకు చెప్పారు. ఈ ప్రోటోకాల్ అమలులో ఉన్న మార్గంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన తర్వాత తాను ఈ చర్య తీసుకున్నట్లు సిద్దరామయ్య చెప్పారు.
తన రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. అయితే తమ పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారికి లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ను షారూఖ్ ఖాన్ నుండి రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది.
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలన మరియు సేవల విషయాలలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని తగ్గించే కొత్త ఆర్డినెన్స్‌తో కేంద్ర ప్రభుత్వంతో తాజా పోరాటానికి సిద్దమయ్యారు