Home / జాతీయం
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు సాధారణ సెక్షన్ల కింద వ్యక్తులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది, రాష్ట్ర హోం మంత్రి మరియు ప్రభుత్వ ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ బ్రాంప్టన్‌లో జరిగిన కవాతు దృశ్యాలు వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 17 ఏళ్ల రెజ్లర్ తండ్రి బుధవారం మాటమార్చారు. బ్రిజ్ భూషణ్ పై తాము కోపంతోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశామని చెప్పారు. తాము కోర్టులో చేసిన ప్రకటనను ఇప్పుడే మార్చామని మరియు కేసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
ఒడిశాలోని జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్‌తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 70 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందారు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌లో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.