Home / జాతీయం
సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను ఢిల్లీ మెట్రో లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని అధికారులు శుక్రవారంతెలిపారు. అయినప్పటికీ, మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పై ఇప్పటికీ నిషేధం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్‌కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్‌లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.
Tamilnadu: ‘క్యాష్ ఫర్ జాబ్స్’, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. రాత్రిరాత్రి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఒక పోలీసు అధికారికి నగదు కట్టలతో అతని కుటుంబం సెల్ఫీ తీసుకున్న తక్షణమే బదిలీ అయింది. అతని భార్య మరియు పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వారు రూ. 500 నోట్ల కట్టలతో పోజులివ్వడంతో అతనిపై విచారణ ప్రారంభించబడింది
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.ఢిల్లీ మెట్రోలో ప్రధాని దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు
BJP Central Cabinet Expansion: బీజేపీ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆలోగా జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు
త్రిపుర లోని ఉనకోటి జిల్లా కుమార్ ఘాట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తుంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈనెల 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్‌లో పర్యటిస్తారని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ నుంచి తికమ్‌గఢ్‌కు వెళ్తున్న మినీ ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో