Home / జాతీయం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 17 ఏళ్ల రెజ్లర్ తండ్రి బుధవారం మాటమార్చారు. బ్రిజ్ భూషణ్ పై తాము కోపంతోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశామని చెప్పారు. తాము కోర్టులో చేసిన ప్రకటనను ఇప్పుడే మార్చామని మరియు కేసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
ఒడిశాలోని జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్‌తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 70 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందారు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌లో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.
అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ప్రపంచలో ఎక్కడ నుంచి అయినా శబరి గిరీసుడికి భక్తులు కానుకలు పంపేలా ఈ - కానిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఈ వెబ్ సైట్ ను రూపొందించినట్టు ఆలయ బోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్ వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.