Home / తప్పక చదవాలి
కర్ణాటక సెక్స్ టేప్‌ల కేసు మరింత జటిలం అవుతోంది. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ్ మనవడు పలువురు మహిళలో జరిపిన రాసలీల టేపు ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. గత నెల 26న లోకసభ ఎన్నికల పోలింగ్ మగిసిన వెంటనే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ పారిపోయాడు. కాగా ఆయనపై గ్లోబల్ లుక్ అవుట్‌నోటీసు జారీ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశానికి సంబంధించిన సమాచారం టెర్రరిస్టులకు ఇచ్చి విధ్వంసం సృష్టించేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌కు విడదీయరాని సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి ప్రార్థనలు చేస్తోందన్నారు .
కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా భారత ఎన్నికల సంఘం నిషేధించింది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇటీవల కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన తాజాగా జరిగింది. వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన హైదరాబాద్ లోని, బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
న్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ లా కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా బెనర్జీకి.. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.
కర్ణాటకలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండిల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే స్కాండిల్ వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్ దేశం నుంచి జర్మనీకి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ తొలిసారి ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవాలు నిలకడగా వెలుగు చూస్తాయని, తాను అమాయకుడినని ప్రకటనలో పేర్కొన్నాడు.
లీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అనుజును సమీపంలోని గోకుల్దాస్ తేజ్‌పాల్ ఆస్పత్రికి తరలించారు.. డాక్టర్లు పరీక్ష జరిపి చనిపోయాడని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..