Home / తప్పక చదవాలి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కరోనా సమయం నుంచి విద్యార్థులు చరవాణీల వాడకం పెరిగిపోయింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు కొనిచ్చారు. దానితో పిల్లలు మొబైళ్లకు బానిసలయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్ నాశనం అవుతుందని భావించిన మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో చూసేద్దామా.
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ పౌరులకు తీపి కబురు అందించింది. బ్యాంకు ఖాతాతో పనిలేకుండా నగదు లావాదేవీలను చేపట్టే డిజిటల్ రూపాయిని (ఇ-రూపీ)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది
Gold Price Today: నేటి పసిడి ధర 2022 అక్టోబర్ 07
మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్‌తో సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో పలుసార్లు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది
పని చేసే ఉద్యోగం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఉద్యోగ బాధ్యతలు ఏ మేరకు నిర్వహించామో అన్నది ప్రధానం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా అడపా దడపా ప్రశంసలు కూడా అందుకొంటుంటారు. వీరిలో ఒకరిగా హైదరాబాదు హోంగార్డ్ తన నిజాయితీని ప్రదర్శించి అందరి మన్నన్నలు అందుకొన్నాడు