Home / తప్పక చదవాలి
పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం మాటలకు తెలుగుదేశం శ్రేణులు కట్టుబడ్డారు. ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటిన్ నిర్వహణపై చేతులెత్తేయడంతో తెదేపా కార్యకర్తలే పేదలకు, ప్రజలకు అన్నం అందించేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మైలవరం, రెడ్డి గుంటకు చెందిన చేబ్రోలు నాగేశ్వరరావు సోదరులు తమ పొలంలో పండిన ధాన్యంను అన్న క్యాంటిన్ నిర్వహణకు ఇచ్చేందుకు సిద్దమైనారు
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని ఢిల్లీకి వెళ్లారు.
రాహుల్ జోడో యాత్రకు కొత్త బూస్ట్ వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోన్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్‌లో జరిగింది.
రాజరాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన ప్రకటన చర్చకు తెరతీసింది.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దగ్గు, జలుబు సిరప్‌ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.