Home / తప్పక చదవాలి
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియానే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ఆమె భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నందున మోర్గాన్ స్టాన్లీ భారతదేశ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన సందర్భాన్ని ఆమె ఉదహరించారు.
కీలక వడ్డీ రేట్లని యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)సమావేశ నిర్ణయాలను ప్రకటించారు. రెపోరేటు 6 పాయింట్ 5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6 పాయింట్ 75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
తోషాఖానా కేసులో అరెస్టై.. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోయారు. సీ-క్లాస్ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
వైకాపా నేతలు, మంత్రులు సినీ నటుడు చిరంజీవిపై చేస్తున్న వ్యాఖ్యలపట్ల ఆయన సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ట్విట్లర్లో తీవ్రంగా స్పందించారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్‌లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమని నాగబాబు గుర్తు చేశారు.. అయితే నిజం మాట్లాడిన వ్యక్తి మీద ఆంధ్రా మంత్రులు విషం కక్కుతున్నారని నాగబాబు విమర్శించారు.
భీమవరంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్ పై వైసీపీ నాయకుడైన ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ మరియు అన్ని అధికారిక రికార్డులలో కేరళ రాష్ట్రాన్ని 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్షాలు ఎటువంటి సవరణలు లేదా సవరణలు సూచించకపోవడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇటలీలోని లాంపెడుసా ద్వీపం వద్ద జరిగిన ఓడ ప్రమాదంలో 41 మంది వలసదారులు మరణించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు వ్యక్తుల బృందం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి బయలుదేరిన పడవలో ఉన్నారని ఇటలీకి వెళుతుండగా మునిగిపోయారని వారు చెప్పారు. ప్రమాద సమయంలో ఓడలో ముగ్గురు పిల్లలతో సహా 45 మంది ఉన్నారు.
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్దించారు.చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం వుంది. చిరంజీవి సామాన్య వ్యక్తి కాదని ఉండవల్లి అన్నారు.