Home / తప్పక చదవాలి
విశాఖలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన చంద్రశేఖర్.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ పంపారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారడంతో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు
హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో పెద్ద సీన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మహిళా ఎంపీలు దీనిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీకి బీహార్ ఎమ్మెల్యే నీతూ సింగ్ అండగా నిలిచారు.
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.
విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. ఆంక్షల మధ్యే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. రుషికొండపై నిర్మాణాలను బయటి నుంచే పరిశీలించారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రుషికొండపై పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.
యునైటెడ్ కింగ్డమ్ భద్రతా మంత్రి, టామ్ తుగెన్‌ధాట్ ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి 95,000 పౌండ్ల (సుమారు రూ. 1 కోటి) కొత్త నిధులను ప్రకటించారు. బ్రిటిష్ హైకమిషన్ గురువారం ప్రారంభమైన తుగెన్‌ధాట్ మూడు రోజుల భారత పర్యటన సందర్బంగా ఈ విషయాన్ని తెలిపింది.
మూక హత్యల కేసుల్లో ఉరిశిక్ష విధింపును కేంద్రం ప్రవేశపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పార్లమెంట్లో క్రిమినల్ చట్టాల సవరణను ప్రకటించారు. దీనికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిబంధనలను ఉల్లంఘించి తమ సమ్మతి లేకుండా హౌస్ ప్యానెల్లో పేరు పెట్టారని నలుగురు ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో అతనుప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు.
విశాఖ పట్టణం జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. 12వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకి గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.